కరీంనగర్ లో ఫిల్టర్ చేయకుండానే తాగునీటి సప్లై

కరీంనగర్ లో ఫిల్టర్ చేయకుండానే తాగునీటి సప్లై

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ లోయర్ మానేరు సమీపంలోని 14 ఎంఎల్‌‌డీ ఫిల్టర్ బెడ్ నుంచి బల్దియా ఆఫీసర్లు సరైన రీతిలో ఫిల్టర్ చేయకుండానే తాగునీటిని సప్లై చేస్తున్నారు. ఫిల్టర్ బెడ్‌‌లో సరైన మోతాదులో ఇసుక లేకపోవడం, గులకరాళ్ల గడువు తీరడం, పాడైపోయిన ఎయిర్ ఫిల్టర్లు, పైప్ లైన్లు ఉండడంతో తాగునీరు ఫిల్టర్ కావడం లేదు. 

గడువు ముగిసిన ఇసుక, గులకరాళ్లను పూర్తిగా తొలగించి కొత్తగా వేయాల్సి ఉన్నప్పటికీ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఈ పనులకు రూ.50 లక్షలు మంజూరైనా టెండర్లు పిలవడంలో జాప్యం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై డీఈ లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్ రిపేర్‌‌‌‌ కోసం  రూ.50 లక్షలు శాంక్షన్ అయ్యాయని తెలిపారు. త్వరలో టెండర్లు  పిలుస్తామని, ప్రతీరోజు ఫిల్టర్ అయిన నీటినే  సరఫరా చేస్తున్నామన్నారు.